

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31, 2025 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1, 2026 తెల్లవారుజామున 2 గంటల వరకు నెక్లెస్ రోడ్ (పీవీఎన్ఆర్ మార్గ్), ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పై ప్రైవేట్, పబ్లిక్ వాహనాలకు ఎంట్రీ లేదు. బేగంపేట్, టోలీచౌకి ఫ్లైఓవర్లు మినహా నగరంలోని మిగతా అన్ని ఫ్లైఓవర్లు అవసరాన్ని బట్టి మూసివేయబడతాయి.
ఎయిర్పోర్టు వైపు వెళ్లే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పై ఫ్లైట్ టికెట్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, భారీ గూడ్స్ వాహనాలు, భారీ ప్యాసింజర్ వాహనాలు హైదరాబాద్ నగర పరిధిలోకి ప్రవేశించకూడదు. ఈ వాహనాలు అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) మార్గాన్ని ఉపయోగించాలి. అదనంగా, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చెకింగ్ మరియు చర్యలు అమలు చేయబడతాయి.


.png&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!