
గాసిప్స్

చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలపై టోల్ వసూలు చేయడానికి ఇరాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదం తెలిపింది. హర్మూజ్ మేనేజ్మెంట్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై అధికారికంగా టోల్ అమలు కానుంది.
ఈ ప్రకారం, ఒక్కో చమురు ట్యాంకర్‌పై గరిష్ఠంగా రూ.18.90 కోట్ల వరకు టోల్ వసూలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్ఐబీ వెల్లడించింది. ఈ నిర్ణయం గ్లోబల్ ఆయిల్ సరఫరా మరియు రవాణా ఖర్చులపై ప్రభావం చూపే అవకాశముంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!