
ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ఉన్న ప్రధాన లక్ష్యాలను దాదాపు పూర్తిగా ధ్వంసం చేశామని, అక్కడ ఇక పెద్దగా లక్ష్యాలు మిగల్లేదని తెలిపారు. ఓ వార్తా సంస్థకు టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్.. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ యుద్ధాన్ని ముగించగలనని స్పష్టం చేశారు.
ఇరాన్‌లో ప్రస్తుతం భీకర యుద్ధం కొనసాగుతోందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా సేనలు ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం సృష్టించాయని అన్నారు. తమ ప్రణాళిక ప్రకారం ఆరు వారాల్లో చేయాల్సిన దాడులను ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. అమెరికా సైన్యం ఆపరేషన్‌లో చాలా వేగంగా ముందుకెళ్లిందని కూడా ట్రంప్ వెల్లడించారు.




.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!