
బిజినెస్

అహ్మదాబాద్‌లో ఈ ఆదివారం జరగనున్న ప్రపంచకప్ తుదిపోరులో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడనున్న నేపథ్యంలో జట్టు బస చేయనున్న హోటల్‌ను మార్చాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కీలక పోరుకు ముందు జట్టు కోసం కొత్త వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ఇదివరకు జరిగిన రెండు ముఖ్యమైన పోరులకు ముందు భారత జట్టు ఇదే హోటల్లో బస చేసినట్లు తెలుస్తోంది. ఒకసారి ప్రపంచకప్ తుదిపోరు సమయంలో, మరొకసారి దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్ ముందు కూడా ఇదే హోటల్లో ఉన్నారని సమాచారం. ఆ రెండు మ్యాచ్‌లలో జట్టు ఓటమి పాలవడంతో ఈసారి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హోటల్ మార్పు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!