
గాసిప్స్

ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ అధికారులపై ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అహర్నిశలు పనిచేస్తున్న సిబ్బందిని దుర్భాషలాడటం లేదా వారి విధుల్లో అడ్డంకులు సృష్టించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, రాజకీయ కార్యకర్తలు ఎవరైనా చట్టానికి అతీతులు కాదని, విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఎన్నికల సిబ్బందిపై ఉన్న ఫిర్యాదులను సంబంధిత ఉన్నతాధికారులకు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలని సూచించారు. ఇప్పటికే నమోదైన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్పీలు, సీపీలు కు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!