

హైదరాబాద్ జలవిహార్ వద్ద నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ వాకథాన్‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొని కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులు, యువత ఈ వాక్‌లో పాల్గొన్నారు. జలవిహార్ నుంచి ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వరకు ఈ వాక్ ఉత్సాహంగా సాగింది. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తదితరులు మంత్రి వెంట పాల్గొన్నారు.

హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, పట్టణీకరణ, బయట ఆహారంపై ఆధారపడటం పెరగడంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.41 లక్షల ఫుడ్ బిజినెస్ సంస్థలు ఉన్నాయని, వాటిలో అధిక శాతం పట్టణాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని చెప్పారు. ఆహార కల్తీ వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు, మొబైల్ టెస్టింగ్ వాహనాలు, కొత్త రీజినల్ ల్యాబ్‌లు, కఠిన చట్టపరమైన చర్యలు వంటి చర్యలను మరింత కఠినతరం చేస్తామని తెలిపారు. “ఈట్ రైట్ – స్టే హెల్తీ” సందేశంతో ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!