

అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పుదుచ్చేరిలో బీజేపీ స్థానిక నాయకులను పక్కనపెట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. లాస్‌పేట్‌లో ఈ రోజు జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే పుదుచ్చేరిలో నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.2,000 ఆర్థిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 30,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్ల వరకు సడలిస్తామని, ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని పేర్కొన్నారు. పుదుచ్చేరిలో పరిశ్రమలు, వస్త్ర రంగం గణనీయంగా తగ్గిపోయిందని, సుమారు 100 ఫ్యాక్టరీలు మూతపడ్డాయని ఆయన అన్నారు. అదేవిధంగా పాండిచ్చేరిలో నకిలీ ఔషధాల తయారీ రాకెట్ నడుస్తోందని, నకిలీ మందులు తయారవుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.






.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!