కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి మోహనకృష్ణ, మనవరాలు నందమూరి మోహన రూప, పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబు కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీలు తుమ్మల ప్రసన్న కుమార్, వైవిఎస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహనకృష్ణ గారు మాట్లాడుతూ, తన తండ్రి ఎన్టీఆర్ గారు రాయలసీమ అభివృద్ధికి సాగునీరు వంటి విషయాల్లో చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ MLA శ్యామ్ బాబు గారికి, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా నందమూరి మోహన రూప గారు కూడా తాతగారి విగ్రహావిష్కరణకు ఆహ్వానం అందుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే శ్యామ్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తమ చేతుల మీదుగా ఆవిష్కరించడం గర్వకారణమని చెప్పారు. బీసీలకు రాజకీయంగా నిలదొక్కుకునే అవకాశం వచ్చినందుకు ఎన్టీఆర్ గారే కారణమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఉండాలని తన ఆకాంక్ష వ్యక్తం చేస్తూ, పార్టీ క్యాడర్ సహకారంతో మరిన్ని విగ్రహావిష్కరణలు నిర్వహించాలనే సంకల్పాన్ని తెలిపారు. కార్యక్రమం ముగింపులో నాయకులు, అభిమానులు ఎన్టీఆర్ గారి సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.








.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!