
న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పోషకాహారంలో మార్పులు చేసింది. కొత్త నిర్ణయం ప్రకారం వారంలో రెండు రోజుల పాటు చిన్నారులకు గుడ్డు వేయించిన అన్నం అందించనున్నారు. అదే రోజుల్లో ఉడికించిన శనగలను కూడా పిల్లలకు ఇవ్వనున్నారు. ఈ కొత్త ఆహార విధానాన్ని అమలు చేయడంతో ముందు ఇచ్చే పులిహోరను నిలిపివేశారు.
పిల్లల పోషకాహారాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. బాలామృతం పంపిణీలో కూడా మార్పులు చేశారు. ఏడునెలల నుంచి పన్నెండునెలల వరకు ఉన్న పిల్లలకు జూనియర్ బాలామృతం, పదమూడు నెలల నుంచి ముప్పై ఆరు నెలల పిల్లలకు సీనియర్ బాలామృతం అందించనున్నారు. ఈ చర్యలతో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మెరుగైన పోషకాహారం అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!