

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరణించారనే పుకార్లు సామాజిక వేదికల్లో విస్తృతంగా వ్యాపించాయి. ఇరాన్ దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా ఆయన ప్రజల్లో కనిపించకపోవడం, మాధ్యమాలకు దూరంగా ఉండటంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ నెతన్యాహు ఆదివారం ఒక దృశ్యాన్ని విడుదల చేశారు. ఒక కేఫ్‌లో కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగుతూ తన మరణ వార్తలపై వ్యంగ్యంగా స్పందించారు.
ఆ దృశ్యంలో తాను క్షేమంగానే ఉన్నానని, దేశ సేవలో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని నెతన్యాహు స్పష్టం చేశారు. తన చేతులకు పది వేళ్లే ఉన్నాయని చూపిస్తూ గతంలో ప్రచారం జరిగిన ఆరు వేళ్లు ఉన్న దృశ్యం అసత్యమని వివరించారు. దీంతో ఆయన మరణంపై వ్యాపించిన పుకార్లకు ముగింపు పలికినట్లైంది. ఇదిలా ఉండగా నెతన్యాహు బతికి ఉంటే వెంటాడి మరీ చంపుతామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!