
గాసిప్స్

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ తన సొంత నిర్ణయం మేరకే నిలిపివేసిందని తెలిపారు. ఇది సామర్థ్యం లేక ఆపినది కాదని, వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో మాట్లాడుతూ, త్రివిధ దళాల సమన్వయం ఈ ఆపరేషన్లో స్పష్టంగా కనిపించిందని అన్నారు.
అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని మానవత్వానికి మాయని మచ్చగా అభివర్ణిస్తూ, దానిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందని విమర్శిస్తూ, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని తీవ్రంగా ఆరోపించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!