
జనరల్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఒపెక్, ఒపెక్+ నుంచి నిష్క్రమిస్తుందన్న ప్రకటన ప్రపంచ చమురు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం వల్ల గ్లోబల్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ తెలిపారు. అయితే యూఏఈతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా భారత్‌కు ఇది లాభదాయకంగా మారే అవకాశం ఉందన్నారు.
భవిష్యత్తులో యూఏఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ సరఫరా పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఆనింద్య బెనర్జీ అభిప్రాయం ప్రకారం, భారత్-యూఏఈ సంబంధాలు మరింత బలపడతాయి. ముఖ్యంగా చమురు కొనుగోళ్లలో డాలర్లకు బదులుగా రూపాయిల్లో చెల్లింపులు పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!