

అన్నమయ్య జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బి.కొత్తకోట మండలంలోని సెక్షన్ పరిధిలో కొండ దిగువనున్న సెరికల్చర్ ఫాం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. నాయనిబావి, గట్టు, సూరపువారిపల్లె ప్రాంతాల నుంచి ప్రారంభమైన మంటలు గట్టుకొండ, ముక్కొండ, గుర్రపుగుట్టల వరకు వ్యాపించాయి. ఎండిన ఆకులు, గడ్డి అధికంగా ఉండటంతో అగ్ని వేగంగా విస్తరించింది.
స్థానికుల సమాచారం ప్రకారం రాత్రి వరకు సుమారు 600 ఎకరాలకుపైగా అడవి దగ్ధమైంది. మంటల ధాటికి అడవి జంతువులు ప్రాణభయంతో పరుగులు తీయగా, కొన్ని జంతువులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సెరికల్చర్ ఫాం వద్ద మంటలను పూర్తిగా ఆర్పివేసినట్లు అధికారులు వెల్లడించారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!