

జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తాజాగా బయటపడింది. ఇన్-సర్వీస్ కోటాలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న 35 మంది విద్యార్థుల అడ్మిషన్లను యూనివర్సిటీ అధికారులు రద్దు చేసి, వారిని తిరిగి పంపించారు.
జగిత్యాల వ్యవసాయ కళాశాలలో వీసీ అల్డాస్ జానయ్య నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పరీక్షలకు ముందు ప్రశ్నపత్రాలను సిబ్బంది సహకారంతో వాట్సాప్ ద్వారా పంపినట్లు విచారణ కమిటీ గుర్తించింది.
ఈ లీకేజీ ద్వారా విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు కమిటీ నిర్ధారించింది. ఈ ఘటనకు సంబంధించి ఒక ఉన్నతాధికారితో పాటు నలుగురు సిబ్బందిని యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.
ఇలాంటి అక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం పై పూర్తిస్థాయి విచారణ జరిపి, మరింత మంది పై చర్యలు తీసుకునే అవకాశముందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!