

సీఎం పదవి ఉంటుందా.. ఊడుతుందా.. అనుకున్నారు. అయితే ఆయనకే అద్భుత అవకాశం దక్కింది. రికార్డు స్థాయిలో సీఎం సిద్ధ రామయ్య శుక్రవారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అందరి చూపు సిద్దూవైపే అనేలా మరికొన్ని గంటలలోనే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. సీఎం సిద్దరామయ్య ఆర్థికమంత్రి హోదాలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు పలు రికార్డులు ఉన్నాయి. అంతకంటే కీలకంగా పలు శాఖల మంత్రులు సైతం మాకు గ్రాంటు పెరిగేనా అనేలా మారిపోయింది. సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర చరిత్రలో మరెవ్వరూ తిరగరాయలేని విధంగా 17వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అంతకంటే ముఖ్యంగా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వారుగాను మరో రికార్డు ఆయన సొంతంగా ఉంది. గత ఏడాది రూ.4.09లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా వచ్చే బడ్జెట్ కనీం రూ.40వేల కోట్లు పెరిగే అవకాశం ఉండవచ్చునని చర్చలు సాగుతున్నాయి.
రికార్డు స్థాయిలో 17వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సీఎం సిద్దరామయ్య రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు బడ్జెట్ ప్రసంగం చేరువయ్యే దిశగా కొత్త విధానం తీసుకువస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 230 ఆర్డీసీ బస్టాండ్లలో స్క్రీన్లను ఏర్పాటు చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!