
సినిమాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌పై సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలిపింది. ఖర్గ్ ఐలాండ్‌పై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామాలతో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగి గల్ఫ్ దేశాల్లో అప్రమత్తత పెరిగింది.
ఇదిలా ఉండగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ముఖ్యమైన ఓడరేవుల ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. ముఖ్యంగా దుబాయ్‌లోని జెబల్ అలీ పోర్ట్ వద్ద ఉన్నవారు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. అలాగే అబుదాబిలోని ఖలీఫా పోర్ట్ సమీప ప్రాంతాల నుంచి కూడా ప్రజలు దూరంగా ఉండాలని తెలిపింది. గల్ఫ్ ప్రాంతాల్లో పౌర మరియు వాణిజ్య ఆస్తులు కూడా లక్ష్యంగా మారే అవకాశం ఉందని ఇరాన్ హెచ్చరించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!