
క్రీడలు

దేశ రవాణా రంగంలో కీలక మైలురాయిగా నిలిచేలా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని మీరట్ పర్యటన సందర్భంగా దేశంలోని తొలి హై స్పీడ్ మెట్రో రైల్ సేవలను ప్రారంభించారు. ఢిల్లీ–మీరట్ రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) ద్వారా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని స్వయంగా హై స్పీడ్ మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో ఢిల్లీ నుంచి మీరట్ మధ్య ప్రయాణ సమయం సుమారు 55 నిమిషాలకు తగ్గనుంది. వేలాది మంది ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. మెట్రో ప్రారంభంతో పాటు రూ.12,930 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని దేశానికి అంకితం చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం స్పష్టంచేసింది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!