
గాసిప్స్
.webp&w=3840&q=75)
టీ20 ప్రపంచకప్‌లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ కేవలం ఒక క్రీడా పోటీ కాదు; ఇది మొత్తం టోర్నమెంట్‌కు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే కీలక ఘట్టం. సుమారు రూ.4,500 కోట్ల (500 మిలియన్ డాలర్లు) విలువైన ఈ ఒక్క మ్యాచ్ ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్షిప్, టికెటింగ్ ద్వారా అపార ఆదాయాన్ని తీసుకొస్తుంది. 10 సెకన్ల యాడ్ స్లాట్‌కే రూ.25–40 లక్షలు పలికే స్థాయిలో ఈ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది.
ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే ప్రసారకర్తలకు దాదాపు రూ.300 కోట్ల నష్టం వాటిల్లే అవకాశముంది. దీని ప్రభావం ఐసీసీ ఆదాయ పంపిణీపై పడటంతో చిన్న దేశాల క్రికెట్ బోర్డులకూ దెబ్బ తగులుతుంది. భారత్ ఈ నష్టాన్ని తట్టుకోగలిగినా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఇది దీర్ఘకాలిక ఆర్థిక, ప్రతిష్ఠాపరమైన ప్రమాదంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!