
న్యూస్

ఐ-బొమ్మ వెబ్సైట్ కేసులో ప్రధాన నిందితుడు రవి పోలీసు కస్టడీకి పంపాలని కోరిన విజ్ఞప్తిని నాంపల్లి కోర్టు ఆమోదించింది. విచారణను మరింత లోతుగా కొనసాగించేందుకు రవిని ఐదు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచాలని సీసీఎస్ అధికారులు కోర్టును కోరారు.
కొత్తగా విడుదలయ్యే సినిమాలను ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగించి అక్రమంగా దొంగిలించి ఐ-బొమ్మ సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో, ఇటీవల హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న సుమారు రూ.3 కోట్లు కూడా అధికారులచే సీజ్ చేశారు.
అంతేకాక, బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్లు దర్యాప్తులో బయటపడింది.












.webp&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!