
క్రీడలు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ గ్రామం వద్ద ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెన వద్ద అదుపుతప్పి సమీపంలోని వాగులో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల కేకలతో ఆ ప్రాంతం కలకలం రేపింది.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టగా, పోలీసులు మరియు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని బస్సు కిటికీలు, తలుపుల ద్వారా బయటకు తీసి ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!