

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలోని ఎస్సీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థిని పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృతి చెందింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రిపబ్లిక్ డే వేడుకల కోసం ఆటోలో ఫర్నిచర్ తెప్పించిన సిబ్బంది, దాన్ని విద్యార్థులతోనే అన్లోడ్ చేయించారు. ఆ సమయంలో ఆటో నుంచి ఫర్నిచర్ దించుతూ సంగీత అకస్మాత్తుగా కిందపడిపోయి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సంగీత మద్నూర్ మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. ఈ ఘటన పూర్తిగా పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!