
శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్డులో ఏర్పాటు చేసిన “కలర్స్ 2.0” కేంద్రాన్ని నటి రెజీనా కసాండ్రా ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ కలర్స్ ప్రారంభించిన ఈ కేంద్రం సంస్థకు చెందిన యాభై మూడవ శాఖగా నిలిచింది. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ ఒత్తిడిని తగ్గించుకోవడం, అధిక ఆలోచనలను దూరం పెట్టడం ద్వారా మంచి ఆరోగ్యం మరియు అందాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. తాను దక్షిణ భారతీయ వంటకాలను ఎంతో ఇష్టపడతానని, కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తానని కూడా చెప్పారు.

కలర్స్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం అత్యాధునిక సాంకేతికతతో బరువు నియంత్రణ, జుట్టు మరియు చర్మ సమస్యలకు ప్రత్యేక చికిత్సలను ఈ కేంద్రంలో అందించనున్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ రెండు దశాబ్దాలకు పైగా అనుభవంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో సురక్షితమైన విధానాలతో చికిత్సలు అందించడం సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!