
గాసిప్స్

రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగ నేపథ్యంలో రేషన్ షాపుల్లో ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. వచ్చే నెల 1 వ తేదీ నుంచి ప్రజలకు రూ. 20 కే కేజీ గోధుమ పిండి అందించనుంది. ఈ పథకం సామాన్య నిత్యావసరాల సరుకులతో పాటు, గోధుమ పిండిని కూడా అందించడం లక్ష్యంగా ఉంది.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజీ గోధుమపిండి రూ.40 నుంచి 80 వరకు లభిస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం దీన్ని తక్కువ ధరలో ప్రజలకు అందిస్తూ, రేషన్ ద్వారా సరఫరా చేయనుంది. మొదటగా ఈ పథకం జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో అమలు చేసి, తరువాత గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించనుంది.
ఇప్పటికే పలు జిల్లాలోని రేషన్ షాపులకు సరుకులు చేరగా డిమాండ్‌ను బట్టి మరిన్ని సరుకులను పంపిణీ చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!