
గాసిప్స్

జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ తొలిసారిగా భారత్కు పర్యటనకు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 12, 13 తేదీల్లో ఆయన అహ్మదాబాద్, బెంగళూరులో పర్యటించనున్నారు. 12వ తేదీన అహ్మదాబాద్లో ప్రధాని మోదీ అధికారికంగా మెర్జ్కు స్వాగతం పలకనున్నారు.
భారత్–జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి గతేడాదితో 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!