

ఒకప్పుడు సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ గుర్తుకొచ్చేది. ఏ సమాచారం కావాలన్నా అందరూ గూగుల్‌పైనే ఆధారపడేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వేగంగా పెరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో చాలా మంది ఏఐ చాట్బాట్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం ప్రారంభించారు. ఇటీవల అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం, పనుల్లో సహాయం పొందడం, ట్రెండీ ఫొటోలు సృష్టించడం, సలహాలు తీసుకోవడం వంటి అవసరాల కోసం యువత ఎక్కువగా ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నారని వెల్లడైంది. కొందరు ఈ చాట్బాట్లతో స్నేహితుల్లా మాట్లాడుకుంటూ తమ వ్యక్తిగత సమస్యలు, భావాలను పంచుకుంటున్నారని కూడా సర్వేలో వెల్లడైంది.
స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్తో పెరిగిన జెన్ జీ అమ్మాయిలు కేవలం టెక్నాలజీ వినియోగదారులే కాదు—ఆవిష్కర్తలుగా కూడా నిలుస్తున్నారు. నీటి కాలుష్యాన్ని గుర్తించేందుకు ‘టెథింక్’ అనే ఏఐ ఆధారిత పరికరాన్ని రూపొందించిన గీతాంజలి రావు, సైబర్ బులీయింగ్ను అరికట్టేందుకు ‘రీథింక్’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన త్రిష ప్రభు ఈ తరానికి చెందిన యువ ప్రతిభలు. అంతేకాదు, అంధులకు ఉపయోగపడే స్మార్ట్ కేన్, ఆల్జీమర్స్ బాధితులకు సహాయపడే అప్లికేషన్లు, శరీర ఉష్ణోగ్రతతో వెలిగే టార్చ్లైట్లు వంటి ఎన్నో ఆవిష్కరణల ద్వారా జెన్ జీ అమ్మాయిలు సమాజంలో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!