

పాలు మరియు పాల ఉత్పత్తుల విక్రయంపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోఆపరేటివ్ డెయిరీలను మినహాయించి మిగతా పాల ఉత్పత్తిదారులు, పాల విక్రేతలు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ పొందాలని ఆదేశించింది. ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం, వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ చర్యలో భాగంగా అన్ని రాష్ట్రాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పాల ఉత్పత్తిదారులు, విక్రేతలు లైసెన్స్ నిబంధనలు పాటిస్తున్నారో లేదో తనిఖీలు నిర్వహించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది. ఈ ప్రత్యేక తనిఖీల పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక సమర్పించాలని కూడా రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పాల నాణ్యతను మెరుగుపరచడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

















.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!