

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు మంగళగిరిలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని సుమారు 11.16 లక్షల దివ్యాంగులకు ఈ పథకం ఉగాది కానుకగా ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం ద్వారా మొత్తం 12.76 లక్షల మంది దివ్యాంగులు మరియు వారి సహాయకులు లబ్ధి పొందనున్నారు. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. దివ్యాంగులతో వచ్చే సహాయకులకు టిక్కెట్‌పై 50 శాతం రాయితీ కూడా కల్పించారు.
ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిసి ప్రారంభించనున్నారు. పథకాన్ని ప్రారంభించిన తర్వాత వీరు దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయనున్నారు. అనంతరం దివ్యాంగులకు ముఖ్యమంత్రి ఆత్మీయ విందు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే రోజు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజా ప్రతినిధులు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, అనంతరం వారితో భోజనం చేయనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు రూ.207 కోట్లను ఆర్టీసీకి చెల్లించనుంది. అలాగే ఇప్పటికే అమల్లో ఉన్న స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు 52 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1826 కోట్లకు పైగా ఖర్చు చేసింది. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3 న సీఎం చంద్రబాబు ప్రకటించిన ఈ పథకాన్ని ఇప్పుడు ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.











.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!