
గాసిప్స్

పోలవరం జిల్లా దేవరపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నిన్న 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, ఇవాళ మరో ఆరుగురికి ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయి. రెండు రోజులుగా ఈ సమస్య కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
రాత్రి నుంచి విద్యార్థులు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులను రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై విచారణ చేయాలని కూడా సూచించారు.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!