
రాజకీయాలు

హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలోని ఓ పబ్‌లో నిర్వహించిన డ్రగ్ టెస్టులు కలకలం రేపాయి. పోలీసులు 64 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 8 మందికి డ్రగ్ వినియోగం పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. వీరిలో కొందరు గంజాయి వినియోగించినట్లు గుర్తించగా, మరికొందరు ఇతర డ్రగ్స్ ఉపయోగించినట్లు తెలిసింది. ఈ ఘటన నగరంలో నైట్‌లైఫ్‌లో డ్రగ్స్ వినియోగంపై మళ్లీ చర్చకు దారితీసింది.
ఈ పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా పాల్గొన్నట్లు వార్తలు రావడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన ఆమె, తన డ్రగ్ టెస్టు రిజల్ట్ నెగెటివ్ వచ్చిందని వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు. పబ్‌లో తన యూరిన్ శాంపిల్ తీసుకున్నారని, తాను ఎలాంటి డ్రగ్స్ వినియోగించలేదని ఆమె పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!