
సినిమాలు

అంతర్జాతీయ యుద్ధ పరిణామాల ప్రభావంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని చిన్న హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్ల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడం, ధరలు ఒక్కసారిగా పెరగడం, రీఫిల్లింగ్ గడువు 25 రోజులకు పెరగడం వంటి కారణాలతో హోటల్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ కొరత కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న హోటళ్లు తాత్కాలికంగా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఉదయం నుంచి రాత్రివరకు కస్టమర్లతో రద్దీగా ఉండే టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. రోజూ కలిసి టీ తాగుతూ, టిఫిన్ చేస్తూ గడిపే ప్రజల సందడి కూడా తగ్గిపోయింది.



.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!