
రాజకీయాలు

ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్‌తో బాధపడుతున్న 18 నెలల బాలుడికి వైద్యులు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించారు. సుమారు 10 కిలోల బరువున్న ఈ చిన్నారికి తండ్రి లివర్‌లోని కొంత భాగాన్ని సేకరించి అమర్చారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా అందించారు. శస్త్రచికిత్స అనంతరం బాలుడి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై మంత్రి రాజనరసింహ వైద్య బృందాన్ని అభినందించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!