
న్యూస్

ఈ నెల నుంచి దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల చలి తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో పగటి వేడి పెరిగి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని పేర్కొంది. అయితే కేరళ, మధ్య భారతాన్ని మినహాయిస్తే దేశంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సగటుకు మించి నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!