

మేఘాంశ్ శ్రీహరి హీరోగా రూపొందుతున్న ‘ఆస్మాన్’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. శ్రీ క్లింకార సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ నందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకకు సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. సాయి దుర్గ తేజ్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్ అందించారు.
ఈ సందర్భంగా మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ చాలా కొత్తగా ఉందని, ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సినిమాకు మద్దతుగా వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ ఇది తనకు తెలుగులో తొలి సినిమా అని చెప్పారు. నిర్మాతలు తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని మూడు షెడ్యూళ్లలో పూర్తి చేస్తామని, ఉత్కంఠభరితమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటామని అన్నారు.
నిర్మాతలు శ్రీకాంత్ మన్నెం, వెంకటేష్ కొండారు మాట్లాడుతూ ఈ సినిమా తమ బ్యానర్లో తొలి ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉందన్నారు. కథ నచ్చి మేఘాంశ్‌ను హీరోగా ఎంపిక చేశామని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుందని, మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందిస్తుండగా, ఛాయాగ్రహణం షోయబ్ నిర్వహిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని కృష్ణ మోహన్ తల్లూరి చూసుకుంటున్నారు. చిత్ర బృందం ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించేందుకు సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!