

డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకలను ప్రజా ప్రభుత్వ రెండేళ్ల విజయంగా ప్రతిబింబించేలా ప్లాన్ చేయాలని సూచించారు.
సమిట్ ఏర్పాట్లపై సీఎంవోతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం, భారీ వేదిక, అంతర్జాతీయ స్థాయి ఆకర్షణీయమైన ఏర్పాట్లు ఉండాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
డిసెంబర్ 8 — తొలి రోజు:
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రెండు సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు స్పష్టంగా చేరేలా ప్రదర్శనలు, పండుగ వాతావరణాన్ని తలపించేలా డిజైన్ చేయాలని ఆదేశించారు.
డిసెంబర్ 9 — రెండో రోజు:
తెలంగాణ భవిష్యత్తు దృష్టి ప్రతిబింబించే “తెలంగాణ రైజింగ్ 2047” డాక్యుమెంట్‌ను ఆవిష్కరించడంతో పాటు, పెట్టుబడులను ఆకర్షించే పారిశ్రామిక విధానాన్ని ప్రపంచానికి చూపించే రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి శాఖ తమ భవిష్యత్ లక్ష్యాలను శక్తివంతమైన AV ప్రదర్శనల రూపంలో చూపించాలని ఆదేశించారు.
దేశ, విదేశాల ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించి, వారికి అత్యుత్తమ వసతి–భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎం స్పష్టం చేశారు. సమన్వయంతో పనులు చేసి ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతం చేయాలని సూచించారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్‌లో అన్ని విభాగాలు కీలక పాత్ర పోషించాలని సీఎం చెప్పారు.
ఈ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో పొందుపరిచే అంశాలపై ఈనెల 25 నుంచి ఒక్కో శాఖతో వరుసగా సమీక్షలు చేస్తామని తెలిపారు.
ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలతో రూపొందుతున్న ఈ డాక్యుమెంట్‌కు, శాఖల సమీక్షల్లో వచ్చే విలువైన సూచనలను జోడించి తుది రూపం ఇస్తామని సీఎం పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!