
బిజినెస్

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకటపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నేతలు వాజ్పేయీ దేశానికి చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్య బలోపేతం, దేశాభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ పెంపులో ఆయన కీలక పాత్రను ప్రశంసించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!