

అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత ఉధృతం చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తాజాగా ఒక్కరోజే 242 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు మరియు వాటి అనుబంధ లింకులను బ్లాక్ చేసింది. అక్టోబర్ 2025 నుంచి అమల్లో ఉన్న ఆన్లైన్ గేమింగ్ చట్టం ప్రకారం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 7,800 నుంచి 8,000 వరకు అక్రమ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిలిపివేశారు. విదేశాల నుంచి నిర్వహించబడుతున్న ఈ వెబ్సైట్లు పన్నుల పరిధిలోకి రాకుండా ఆదాయాన్ని బయటకు తరలిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది.
ఈ నేపథ్యంలో వైద్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానసిక వైద్యుల ప్రకారం, ఈజీ మనీ ఆశ చూపే బెట్టింగ్ యాప్స్ ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. దీని వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యల వరకు వెళ్లే పరిస్థితులు పెరుగుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్‌లపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తుండగా, యువత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!