

రేపటి నుంచి జనగణన తొలి దశ ప్రారంభం కానుంది. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను సేకరించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా జనాభా మరియు ప్రజల జీవన పరిస్థితులపై సరైన సమాచారం సేకరించడమే లక్ష్యం. కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్య, వారి పేర్లు, లింగం, అలాగే కుటుంబ యజమాని వివరాలను నమోదు చేస్తారు.
కుటుంబ యజమాని షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ లేదా ఇతర వర్గాలకు చెందినవారో కూడా తెలుసుకుంటారు. అదనంగా ఇంటిలో గదుల సంఖ్య, వివాహిత జంటల సంఖ్య, ఇంటిలో ఉన్న సౌకర్యాలు వంటి వివరాలను కూడా నమోదు చేస్తారు. కుటుంబ ఆస్తులు, ఆదాయ వనరులపై సమాచారం కూడా సేకరించబడుతుంది.
ఇంటిలో ఉన్న వస్తువులు కూడా నమోదు చేస్తారు. ఉదాహరణకు రేడియో, టెలివిజన్, అంతర్జాల సౌకర్యం, ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్, కారు, వ్యాను వంటి వివరాలను తీసుకుంటారు. అలాగే అవసరమైనప్పుడు సంప్రదించడానికి ఇంటి యజమాని ఫోన్ నంబరు కూడా నమోదు చేస్తారు.







.jpeg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!