

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి బాంబు బెదిరింపులతో కలకలం రేగింది. నెదర్లాండ్ కు వెళ్లే ఒక విమానంలో బాంబు పెట్టినట్లు పేర్కొంటూ గుర్తుతెలియని వ్యక్తి ఎయిర్పోర్ట్ అధికారులకు ఈమెయిల్ పంపినట్లు సమాచారం.
ఈ మెయిల్ అందగానే విమానాశ్రయ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అప్రమత్తతలో భాగంగా సదరు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయించి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం బాంబు నిరోధక బృందాలు విమానం అంతటా క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాయి.
ప్రస్తుతం ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు శంషాబాద్ విమానాశ్రయానికి 20 కి పైగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. చాలా సందర్భాల్లో ఇవి నకిలీవేనని తేలినా, భద్రత పరంగా ప్రతి సమాచారం పై అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!