
సినిమాలు

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ల్యాండింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంది. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గింది. భద్రతా దృష్ట్యా విమాన సిబ్బంది పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించారు.
విజిబిలిటీ సమస్యల కారణంగా ఆ ప్రత్యేక విమానం కొంతసేపు విజయవాడ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనల మేరకు తదుపరి చర్యలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!