

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణకుమార్ లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధిత విద్యార్థిని గర్భం దాల్చి, తరువాత ప్రొఫెసర్ ఆమెను బెదిరించి స్వస్థలానికి పంపించినట్లు సమాచారం. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా ఆమె వీడియో తీసి లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని ఆరోపించబడింది. ఈ విషయం బయటపడడంతో ఇన్‌ఛార్జి వీసీ రజనీకాంత్ శుక్లా తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు ప్రొఫెసర్ల మొబైల్ ఫోన్లు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
విద్యార్థుల ప్రకారం, బాధితురాలు ఈ ఘటనపై పది రోజుల కిందటే వీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. దీనిపై చర్యగా అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణకుమార్‌ను డిసెంబర్ 1న సస్పెండ్ చేసినట్లు, డిసెంబర్ 2 నుంచి ఆయన విధులకు హాజరుకాలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఈ కేసుపై విశ్వవిద్యాలయం అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ద్వారా విచారణ కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!