

అమెరికా వీసా నిబంధనల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయని అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్ కుమార్ తెలిపారు. మాదాపూర్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత విద్యార్థులకు జారీ చేసే F-1 వీసాల్లో దాదాపు 50 శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించారు. H-1B వీసా నిబంధనల్లో మార్పులు, పెరిగిన ఫీజులు, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూడాల్సిన సుదీర్ఘకాలం కారణంగా భారతీయులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో భారతీయులకు EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ ఒక సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ అంశం రాజకీయ, ఆర్థిక చర్చల్లో ప్రధానంగా నిలుస్తోందని, విద్యార్థి వీసాల నుంచి గ్రీన్ కార్డు బ్యాక్‌లాగ్‌ల వరకు భారతీయుల దరఖాస్తులకు కఠిన తనిఖీలు, జాప్యం పెరిగాయని పేర్కొన్నారు. టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియాల్లోని రీజనల్ సెంటర్లలో 8 లక్షల డాలర్ల పెట్టుబడి ద్వారా గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉందని వివరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!