

దేశం లో 16 ఏళ్ల తర్వాత జాతీయ జనగణన (సెన్సస్) జరగనుందని తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. సెన్సస్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి సెన్సస్ “జనగణన అన్ని సర్వేలకు మదర్‌గా ఉంటుంది. పబ్లిక్ అవేర్నెస్ ద్వారా మాత్రమే సెన్సస్ సక్సెస్ అవుతుంది. దేశంలో ఇది అత్యంత భారీ ఎక్ససైజ్, మరియు సెన్సస్ నిర్వహించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. 2021లో కరోనా కారణంగా సెన్సస్ నిర్వహించలేకపోయాం. స్వాతంత్ర్యం తర్వాత ఇది 8వ జాతీయ జనగణన. గ్రామీణ స్థాయికి చేరి, పట్టణాల వరకు ప్రజల మైగ్రేషన్, అవసరాలు, నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల కోసం సెన్సస్ ముఖ్య ఆధారంగా ఉంటుంది,” అని తెలిపారు.
“సెన్సస్‌లో అందరినీ భాగస్వాములుగా చేసుకోవాలి. సమాచారాన్ని సేకరించే ప్రశ్నలు మాత్రమే అడగబడతాయి. సెన్సస్‌లో సమాచారం ఇవ్వకపోతే వెయ్యి రూపాయల పెనాల్టీ ఉంటుంది. సెక్షన్ 15 ప్రకారం ఇచ్చిన సమాచారం గోప్యంగా ఉంటుంది, కోర్టులో ఎవిడెన్స్‌గా ఉపయోగించరాదు. సెన్సస్‌లో పనిచేసే అధికారులకు రక్షణ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగనున్న ఇది తొలి జనగణన, అలాగే కుల గణన స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి జరుగుతోంది,” అని పేర్కొన్నారు.
ఈ సారి సెన్సస్ 11 మే, 2026 నుండి 9 జూన్, 2026 వరకు మొదటి దశలో (హౌసింగ్ సెన్సస్) జరగనుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ 26 ఏప్రిల్ నుండి 10 మే వరకు ఉంటుంది. రెండో దశ 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు, ఇంటి లేని వ్యక్తుల వివరాలు 28 ఫిబ్రవరి నాడు సేకరించబడతాయి. రివిసినల్ రౌండ్ 1 మార్చి నుంచి 5 మార్చి వరకు జరుగుతుంది. ఈ సారి సెన్సస్ డిజిటల్ పద్ధతిలో, పట్టణాల్లో 420 రకాల, గ్రామాల్లో 400 రకాల సమాచారాన్ని సేకరిస్తూ, ఇంటి పరిస్థితులు, వసతులు, ఆస్తులు, ఆహార అలవాట్లు తదితర వివరాలను సేకరిస్తుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!