

రవితేజ ఇటీవల వరుస పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ధమాకా, వాల్తేర్ వీరయ్య తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలోకి వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి (BMW) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి భావోద్వేగ కథనాలతో పేరు తెచ్చుకున్న కిశోర్ తిరుమల దర్శకత్వం వహించడం విశేషం. ఈసారి ఆయన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ట్రైలర్, టీజర్లకు వచ్చిన స్పందనతో BMWపై మంచి బజ్ ఏర్పడింది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా, సంక్రాంతి సీజన్లో పోటీ ఉన్నప్పటికీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. షూటింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు కిశోర్ తిరుమల ప్లానింగ్ సినిమాకు ప్లస్‌గా మారింది. ఎస్ఎల్వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అయితే, రవితేజతో పాటు కిశోర్ తిరుమల కెరీర్‌కూ ఇది కీలక మలుపుగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!