
జనరల్

ఆసియా పారా గేమ్స్‌లో భారత్ తొలి రోజే సత్తా చాటింది. ప్రారంభ రోజున భారత క్రీడాకారులు మొత్తం 11 పతకాలు సాధించారు. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల వేటను ఘనంగా ప్రారంభించింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగంలో మోనా అగర్వాల్ స్వర్ణ పతకం సాధించింది. పురుషుల లాంగ్ జంప్ టీ47 విభాగంలో నిషాద్ కుమార్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. వీరి విజయాలతో తొలి రోజే భారత్ ఖాతాలో స్వర్ణాలు చేరాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!