

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘రణబాలి’ సినిమాపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. రణబాలి పాత్రలో విజయ్ అద్భుతంగా నటించారని, విజయ్–రష్మికల మధ్య బంధం తెరపై కనిపించే కెమిస్ట్రీకి మించినదని పేర్కొన్నారు. జయమ్మ పాత్రకు రష్మిక ప్రాణం పోశారని, అనిరుధ్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసించారు.
చరిత్రపై పరిశోధన చేసి, మరుగునపడిన ఓ ఘట్టాన్ని తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కృషిని సందీప్ రెడ్డి వంగా అభినందించారు. ఈ కథను పాఠ్యపుస్తకాల్లో చేర్చదగినదిగా అభివర్ణించారు. సందీప్ సమీక్షపై విజయ్ దేవరకొండ కృతజ్ఞతలు తెలిపారు. ‘అర్జున్ రెడ్డి’ ప్రీమియర్ల తర్వాత సందీప్ తనను ఆప్యాయంగా హత్తుకుని ప్రశంసించిన రోజులు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. పదేళ్ల తర్వాత కూడా తమ సినిమా ఆయనకు నచ్చడం ఆనందంగా ఉందని విజయ్ పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!