

యెమెన్‌లోని షబ్వా ప్రావిన్స్‌లో సోమవారం హౌతీ తిరుగుబాటుదారులు భీకర దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ భద్రతా బలగాల శిక్షణ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో 53 మంది మరణించగా, మరో 200 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఇరాన్ మద్దతున్న హౌతీలు మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
యెమెన్‌లోని శిక్షణ శిబిరంపై దాడి చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటించారు. ఆ శిబిరాన్ని సౌదీ బలగాలు నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై సౌదీ అధికారులు స్పందించలేదు. హౌతీల ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యెమెన్ ప్రభుత్వ బలగాలు ఈ నెల నుంచి దాడులను తీవ్రతరం చేశాయి. హౌతీలకు, సౌదీ నేతృత్వంలోని కూటమి మద్దతున్న అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!