17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?

Writer: Pooja 10:28 AM, 17 అక్టోబర్, 2026
‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ ప్రస్తుతం సినీ ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతోంది. సినిమా గురించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమైనా ఇందులో చూపించిన దృశ్యాలు, రజినీకాంత్‌ను తెరపై ఆవిష్కరించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన బలంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజయ్ కార్తీక్ కన్నన్ తన కెమెరా పనితనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. గతంలో ‘జైలర్ 1’తో పాటు బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా ఆయన పనిచేశారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ చిత్రానికి విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం అందిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవిని ఆయన కెమెరా ద్వారా ఎంత అద్భుతంగా చూపిస్తారనే ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ‘జైలర్ 2’లో విజువల్స్‌కు మంచి గుర్తింపు రావడంతో ‘కాకా’లోనూ అదే స్థాయి పనితనం కనిపిస్తుందని సినీప్రియులు ఆశిస్తున్నారు. చిరంజీవి తెరపై కనిపించే విధానం, కీలక సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?

మాస్ సినిమాల మధ్య ఫీల్‌గుడ్ కథతో వస్తున్న దుల్కర్

మాస్ సినిమాల మధ్య ఫీల్‌గుడ్ కథతో వస్తున్న దుల్కర్

బాక్సాఫీస్ వద్ద తలైవర్ జోరు.. ‘జైలర్ 2’తో మరోసారి రజనీకాంత్ హవా

బాక్సాఫీస్ వద్ద తలైవర్ జోరు.. ‘జైలర్ 2’తో మరోసారి రజనీకాంత్ హవా

ట్యాగ్లు
జైలర్ 2రజనీకాంత్విజయ్ కార్తిక్ కన్నన్చిరంజీవి కాకాబాబీతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!
సినిమాలు

సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా

బిగ్‌బాస్‌లో షాలిని లవ్ ట్రాక్‌ బెడిసికొట్టిందా?
షోస్

బిగ్‌బాస్‌లో షాలిని లవ్ ట్రాక్‌ బెడిసికొట్టిందా?

ఎలిమినేషన్ తర్వాత అపూర్వ షాకింగ్ కామెంట్స్
షోస్

ఎలిమినేషన్ తర్వాత అపూర్వ షాకింగ్ కామెంట్స్

తొలి రోజే రణబాలికి మంచి ఆరంభం...ఇక వీకెండ్‌పైనే ఆశలు
గాసిప్స్

తొలి రోజే రణబాలికి మంచి ఆరంభం...ఇక వీకెండ్‌పైనే ఆశలు

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ
జనరల్

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్
క్రీడలు

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?
సినిమాలు

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?

‘ఆదర్శ కుటుంబం’  ఇప్పట్లో లేనట్టే?
గాసిప్స్

‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో లేనట్టే?

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?
గాసిప్స్

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?

‘రామాయణం’కు అమెరికాలో భారీ స్పందన!
గాసిప్స్

‘రామాయణం’కు అమెరికాలో భారీ స్పందన!

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!