

ఎస్.ఎస్. రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ #GlobeTrotter కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. నవంబర్ 15 న జరగబోయే టైటిల్ మరియు ఫస్ట్‌లుక్ రిలీజ్ ఈవెంట్‌పై అభిమానుల్లో భారీ ఎక్స్సైట్మెంట్ నెలకొంది. ఈ ఈవెంట్‌ను దుబాయ్‌లోని స్టార్ సినిమాస్, అల్ ఘురైర్ సెంటర్లో సాయంత్రం 5.30 గంటల నుంచి డాల్బీ సినిమా స్క్రీన్‌పై లైవ్‌గా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇంతవరకు ఏ భారతీయ సినిమా చేయని రీతిలో రాజమౌళి టీమ్ గ్లోబల్ ప్రమోషన్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తోంది. నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ వెల్లడించినట్లు, మరో 5–6 లొకేషన్లలో కూడా ఈ ఈవెంట్‌ను లైవ్‌గా చూపించే అవకాశం పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, కెనడా, యుకే అభిమానులు కూడా తమ దేశాల్లో స్క్రీనింగ్ కోరుతున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ ఈవెంట్లో వేలాది మంది అభిమానులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌ను జియో హాట్‌స్టార్‌లో కూడా లైవ్‌గా ప్రసారం చేయనున్నారు.










కామెంట్స్ (1)
రాజమౌళి – మహేష్ బాబు కాంబో అంటేనే హైప్