

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2: తాండవం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5, 2025 న 2D, 3D ఫార్మాట్లలో విడుదలకు సిద్ధమవుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్. థమన్ అందించిన సంగీతం, విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఇటీవల మీడియాతో మాట్లాడిన ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, ఈ సినిమా అఖండ కంటే భారీ స్థాయిలో రూపొందిందని తెలిపారు. ఇందులో బాలకృష్ణ దైవశక్తితో కూడిన పాత్రలో కనిపించనున్నారని, ఆయన ఎదురుగా ఆది పినిశెట్టి బలమైన నెగటివ్ పాత్రలో నటించారని చెప్పారు. బాలయ్య గారు దాదాపు 99 శాతం యాక్షన్ సన్నివేశాలను స్వయంగా చేసినట్లు వెల్లడించారు. శివ తత్వం, ఓంకార శక్తి, త్రిశూలం వంటి ఆధ్యాత్మిక అంశాలతో రూపొందిన ఫైట్ సీక్వెన్సులు ప్రేక్షకులకు అద్భుతమైన వైబ్రేషన్‌ను అందించనున్నాయని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!