

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు విడుదల తర్వాత మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. అయితే కొందరు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మాత్రం మంచి స్పందన లభించింది. మరోవైపు, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు పోస్టర్ విడుదల చేశారు. అయితే సినిమా నిర్మాణ వ్యయంపై ఇండస్ట్రీ వర్గాల్లో భిన్నమైన చర్చ జరుగుతోంది. మొదట ఈ చిత్రాన్ని సుమారు రూ.60 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం, రీషూట్స్ కారణంగా ఖర్చు దాదాపు రూ.130 కోట్లకు చేరినట్లు సమాచారం.
ఈ సినిమా కోసం సుమారు 130 రోజుల పాటు షూటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే చిత్రీకరించిన సన్నివేశాల్లో చాలా భాగం తుది వెర్షన్‌లో కనిపించలేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించడంతో పాటు, బ్రహ్మాజీ పాత్రకు సంబంధించిన సీన్ల నిడివిని కూడా తగ్గించినట్లు సమాచారం. చిత్రీకరించిన ఫుటేజ్‌లో కొంత భాగాన్ని ఉపయోగించకపోవడం, స్క్రిప్ట్ దశలో సరైన స్పష్టత లేకపోవడం వంటి అంశాలు బడ్జెట్ పెరుగుదలకు కారణమయ్యాయని టాక్. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందినప్పటికీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని కొందరు ఇండస్ట్రీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ బడ్జెట్ వివరాలు, ఆర్థిక ఫలితాలపై అధికారిక నిర్ధారణ లేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!